వైరల్ అవుతున్న విజయ్-రష్మిక లిప్ లాక్ సీన్…

చిత్ర పరిశ్రమను లీకుల బెడద వదలడం లేదని మరోసారి గీత గోవిందం తో బయటపడింది. మరో మూడు రోజుల్లో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవ్వగా ఈ చిత్రాన్ని రాజేష్ అనే ఎడిటర్ ఫుల్ మూవీ ని బయటకు పంపాడు. దీంతో సినీమా తాలూకా హైలైట్ సన్నివేశాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా సినిమాలోని విజయ్- రష్మిక లిప్ లాక్ సన్నివేశం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఈ సీన్ చూసిన చాలామంది సినీమా కోసం వెతకడం మొదలు పెడుతున్నారు.

ప్రస్తుతం పోలీసులు రాజేష్ ను అరెస్ట్ చేసి , అతడి దగ్గరనుంచి ఒక హార్డ్‌డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ సినిమాను ఎవరికీ పంపించారో వారిని సైతం అరెస్ట్ చేసారు. అయినప్పటికీ చిత్రానికి జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయిందని తెలుస్తుంది. ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తుంది. ఏ చిన్నది జరిగిన దానిని సోషల్ మీడియా లో పెట్టేస్తున్నారు. అలాంటిది ఒక సినీమా మొత్తం బయటకు వచ్చిన తర్వాత దానిని ఆపడం ఎవరి వల్ల కాదు. చూద్దాం రాబోయే రోజుల్లో గీత గోవిందం పరిస్థితి ఎలా ఉండబోతుందో..