ఏపీ నిరుద్యోగులకు సిఎం స్వీట్ న్యూస్


ఇన్నాళ్ల నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి. రాష్ట్రంలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20, 010 వేల పోస్టుల నియమకానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సుమారు 18,448 ఉద్యోగాల భర్తీపై శాసనసభలో బుధవారం ప్రకటన చేయనున్నారు. ప్రత్యక్ష విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, ఇతర శాఖల నియామక సంస్థలు విడివిడిగా ప్రకటనలు ఇవ్వనున్నాయి. ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన ప్రకటనలో 20,010 ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారని చెప్పారు.

కాగ డీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే పోస్టుల వివరాలు ఇలా వున్నాయి
పాఠశాల విద్యా శాఖ- 5000
పురపాలక పాఠశాలలు- 1100
గురుకుల పాఠశాలలు- 1100
సాంఘిక సంక్షేమ గురుకులాలు- 750
షెడ్యూలు ఏరియా ఆశ్రమ పాఠశాలలు- 500
నాన్‌షెడ్యూలు ఏరియా ఆశ్రమ పాఠశాలలు- 300
బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు- 350