ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సమర్పణ లో శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతోన్న లవ్ ఎంటర్ టైనర్ `హలో గురు ప్రేమ కోసమే`. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఇందులో కీలకపాత్రలో నటించగా , అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్‌గా నటించారు. `సినిమా చూపిస్త మావ, నేను లోకల్` వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ క్యూట్ అండ్ సెన్సిబుల్ లవ్ స్టోరీ ఫై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.
దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర టాక్ ఎలా ఉందో..? త్రినాద్ ఎలాంటి కథ తో వచ్చాడో..? దిల్ రాజు నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయో..? దేవి శ్రీ మ్యూజిక్ సినిమాకు హెల్ప్ అయ్యిందా ..లేదా..? అసలు ప్రేక్షకులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
ఇండియా లో కొద్దీ సేపటికి క్రితం ఈ సినిమా విడుదలైనప్పటి , ఓవర్సీస్ లో మాత్రం ఆల్రెడీ విడుదలై టాక్ బయటకు వచ్చింది. సినిమా చూసినవారంతా సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఓవరాల్ గా సినిమా టైం పాస్ మూవీ అని చెపుతున్నారు.
రొటీన్ స్టోరీ అయినప్పటికీ.. ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉందని, కామెడీ బాగుందని అంటున్నారు. మరో రొటీన్ లవ్ డ్రామా మన ముందుకు వచ్చిందని కొంతమంది చెపుతుంటే , టైం పాస్ కోసం చూడొచ్చని, సెకండాఫ్ స్లోగా ఉందని కామెంట్స్ వేస్తున్నారు. రామ్-ప్రకాశ్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయని ఇంకొందరు అంటున్నారు. అనుపమ గత సినిమాలకంటే కాస్త గ్లామర్ డోస్ పెంచిందని , పాటల్లో చాల అందంగా ఉందని తెలుపుతున్నారు.
త్రినాద్ గత చిత్రం నేను లోకల్ ను అంచనా వేసుకొని వెళ్తే నిరాశ తప్పదని , దాని లెవల్లో కాకపోయినా టైం పాస్ మూవీ అని అంటున్నారు. దిల్ రాజు తన ప్రతి సినిమాకు పెట్టెఖర్చు లాగానే దీనికి అదే రేంజ్ లో ఖర్చు చేసారు. మొత్తం మీద యూఎస్ ఆడియన్స్ మాత్రం సినిమా వన్ టైం వాచ్ అంటున్నారు. మరి మన ఆడియన్స్ కు ఎంత నచ్చుతుందనేది చూడాలి.