‘రంగస్థలం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్.. బోయపాటి డైరెక్షన్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా ఈరోజు ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. వారం రోజులుగా మీడియా లో ప్రచారం అవుతున్న ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ తోనే ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.
ఈ లుక్ తో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చరణ్ ను ఎలాగైతే చూడాలనుకున్నారో అలాగే ఫస్ట్ లుక్ ఉందని అంటున్నారు. మరి ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో ఈ కింది పోల్ ద్వారా తెలియజేయండి.