కాస్త చల్లారాక పవన్ వస్తాడట..

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడనే అధికారిక వార్త అభిమానుల్లో సంబరాలు నింపినప్పటికీ..అనుమానం మాత్రం అలాగే ఉంది..ప్రస్తుతం పవన్ తీరు చూస్తుంటే సినిమాల ఫై ఏమాత్రం ఇంట్రస్ట్ లేనట్లు కనిపిస్తున్నాడు. ఎంత సేపు రాజకీయ కోణంలో కనిపిస్తున్నాడు కానీ సినీ నటుడిగా మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ రీ ఎంట్రీ ఇస్తాడో ఇవ్వడో అనేది మాత్రం అనుమానంగానే ఉంది.

అయితే అలాంటి అనుమానాలే అవసరం లేదని చిత్ర యూనిట్ చెపుతున్నారు. పింక్ రీమేక్ లో నటించడం ఖాయం..కాకపోతే కొంచెం రాజకీయ వేడి చల్లారాక పవన్ మూవీ ప్రారంభిస్తారట. ఆ చిత్రం దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మించే పింక్ రీమేక్ కావచ్చు, లేదా ఏఎమ్ రత్నం నిర్మాత దర్శకుడు క్రిష్ తెరకెక్కించే మూవీ ఐనా కావచ్చు అని అంటున్నారు.