కెరియర్ మొదట్లో వరుస ఛాన్సులతో హడావిడి చేసిన రకుల్ ప్రీతీ సింగ్..ఆ తర్వాత ఒక్కసారిగా ఛాన్సులు తగ్గడం జరిగింది. కొత్త భామల ఎంట్రీతో ఈ భామ వైపు చూడడం తగ్గించారు. అయినప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం ఈ భామ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను , నెటిజన్లను, ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది.
సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తుంది. లాక్డౌన్ కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన హీరోయిన్లు ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపడానికి మాల్దీవ్స్ వెకేషన్ ప్లాన్ చేసుకున్నారు. హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్‌కి వెళ్ళింది. పేరెంట్స్, బ్రదర్‌తో కలిసి అక్కడి బీచ్, రిసార్ట్స్‌లో ఎంజాయ్ చేస్తూ.. ఆ పిక్స్ ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది. బీచ్‌లో బికినీలో సేదదీరుతూ రకుల్ రెచ్చగొడుతోంది అంటూ కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.