రెండు వారాల గ్యాప్ లోనే బాక్స్ ఆఫీస్ వద్ద అన్నదమ్ముల సందడి

అక్కినేని అన్నదమ్ములు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయ్యారు. నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ మూవీ ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా..వచ్చే నెల 08 న అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల కాబోతుంది. ఈ రెండు చిత్రాల ఫై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలివి. లవ్ స్టోరీ సినిమా ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక అఖిల్ సినిమాను సెకెండ్ వేవ్ దెబ్బకొట్టింది. అలా వాయిదాలు పడుతూ.. తప్పనిసరి పరిస్థితుల మధ్య 2 వారాల గ్యాప్ లో వస్తున్న ఈ అక్కినేని అన్నదమ్ములు. మరి వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.