మరికాసేపట్లో మొదలుకానున్న అఖండ బెన్ఫిట్ షోలు

‘సింహా’, ‘లెజెండ్’ లాంటి హిట్ సినిమాల తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ‘అఖండ’. ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించాలని గట్టిగా ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటె తెలంగాణ లో నందమూరి అభిమానులకు తీపి కబురు అందించింది తెలంగాణ సర్కార్.

హైదరాబాద్ లో అఖండ బినిఫిట్ షోస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగరంలోని మల్లికార్జున, భ్రమరాంబ థియేటర్లకు బెనిఫిట్‌ షోలు ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది. ఈ స్పెషల్‌ షోలకు టికెట్‌ రేట్లను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా ‘అఖండ’ చిత్రం ఈ థియేటర్లలోనే ప్రదర్శితంకానుంది. ఉదయం 4: 30 ని.లకు ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.