ఖిలాడీ సంక్రాంతి పోస్టర్

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఫిబ్రవరి 11న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ..ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఓ ఐరన్ రాడ్ ని చేత పట్టుకుని రవితేజ కనిపిస్తున్న స్టిల్ ఆకట్టుకుంటోంది.