పుష్ప చిత్రాన్ని చూసి..అభినందించిన కమల్ హాసన్

లోకనాయకుడు కమల్ హాసన్ పుష్ప మూవీ చేసి..చిత్ర యూనిట్ ఫై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన మూవీ పుష్ప. డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా గా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకొని భారీ వసూళ్లు సాధించింది. కేవలం సినీ ప్రేక్షకులు , అభిమానులే కాదు సినీ స్టార్స్ సైతం సినిమా చూసి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

తాజగా విశ్వ నటుడు కమల్ హాసన్ వీక్షించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా కమల్ హాసన్ కి పుష్ప సినిమాను చూపించారు. ఈ విషయాన్ని దేవి శ్రీ ప్రసాద్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ” డియరెస్ట్ ఉలగనయగన్ కమల్ హాసన్ సర్ ధన్యవాదాలు.. మాకోసం మీ సమయాన్ని వెచ్చించి పుష్ప సినిమా చూసినందుకు.. మీరు చాలా స్వీటెస్ట్.. సినిమా చూసి మా పనితనం గురించి మీరు చెప్పిన మాటలు అద్భుతం” అని చెప్పుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ కి అల్లు అర్జున్ స్పందిస్తూ ” పుష్ప సినిమా వీక్షించినందుకు ధన్యవాదాలు కమల్ హాసన్ సార్.. హంబుల్డ్” అని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.