సినిమాల్లో హీరో, హీరోయిన్ల పాత్రలకు తల్లి పాత్రలలో సీనియర్ నటి ప్రగతి సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుంది. కానీ దీనికి భిన్నంగా నటి ప్రగతి నిజ జీవితంలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. సీనియర్ నటి ప్రగతి ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రగతి చేసే రచ్చ మామూలుగా ఉండదు. అందులో ఆమె పలు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఇక ఆమె తాను జిమ్‌లో చేసే వర్కవుట్లకు చెందిన వీడియోలను కూడా పెడుతుంటుంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా అలాంటిదే మరో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఈ వయసులో ఇవి అవసరమా అంటుంటే, మరికొందరేమో హాట్ ప్రగతి ఆంటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.