గాడ్ ఫాదర్ సెట్‌లో లైగర్ టీం సందడి


మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమా గాడ్ ఫాదర్. మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మెగాస్టార్ సినిమా అంటే అభిమానులకు ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిన దర్శకుడిగా మోహన్ రాజా.. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు.

ప్రస్తుతం ముంబై లో సల్మాన్ – చిరంజీవి లపై స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సెట్ లో లైగర్ టీం సందడి చేసారు. ప్రభుదేవా ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ముంబైలో ఈ పాట షూటింగ్ జరుగుతుండగా.. లైగర్ టీం సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. సల్మాన్ ఖాన్, చిరంజీవి గాడ్ ఫాదర్ సెట్‌లో ఉండగా.. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఛార్మీలు సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఇక చిరు, సల్మాన్‌లతొో కలిసి విజయ్ పూరిలు ముచ్చటించారు. ఫోటోలకు పోజులిచ్చారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లను ఇలా కలిసినందుకు సంతోషంగా ఉందని విజయ్, పూరి,చార్మీలు పోస్టులు వేశారు. మీ ప్రేమ, సపోర్ట్ లైగర్‌కు ఎంతో ఉపయోగపడతాయ్ అన్నట్టుగా విజయ్ ట్వీట్ వేశాడు.