ఎన్టీఆర్ అలా.. చంద్రబాబు ఇలా …

సంక్షోభాలు ఎదురుకోవడంలో తెలుగుదేశం పార్టీకి గొప్ప ట్రాక్ రికార్డ్ వుంది. తీవ్రమైన సంక్షోభాలు ఎదుర్కొంది టీడీపీ. 1985 జరిగిన పరిణామాలు, తర్వాత 96, 2014 కాలంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు ఎదురు నిలబడి పోరాడింది తెలుగుదేశం పార్టీ. దాదాపు కనుమరుగైపోతుందనుకున్న సమయంలో ఎదురీది పవర్ లోకి వచ్చింది టీడీపీ.

ఎన్టీఆర్ అలా.. చంద్రబాబు ఇలా :

ఎత్తుగడలు వేయడంలో ఎన్టీఆర్, చంద్రబాబులది చెరో దారి. ఎన్టీఆర్ ‘నేను’ అనే ఇమేజ్ బేస్ లో పార్టీని నడుపుతారు. చంద్రబాబు విషయానికి వచ్చేసరికి తనని హైలెట్ చేసుకుంటూనే ప్రత్యర్దులని బలహీన పరిచే స్కెచ్ మీద వెళ్తారు. ఎన్టీఆర్ మాత్రం ప్రత్యర్దులని రాజకీయంగా ఎదురుకోవడం తప్పితే వారిని ఛిన్నాభిన్నం చేసే కార్యక్రమం జోలికి పోలేదు. ఈ విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకోవాలి. ప్రత్యర్ధులని పూర్తిగా బలహీన పరిచి తన బలం పెంచుకునే స్ట్రాటజీతో వెళ్లారు వైఎస్. అయితే దీన్ని పరాకాష్టకు తీసుకువెళ్ళింది మాత్రం కేసిఆర్, చంద్రబాబులని చెప్పాలి. ప్రత్యర్ధులకు తగిన గౌరవం ఇస్తూనే తమ పార్టీ అభ్యర్ధులని స్ట్రాంగ్ చేసేలా ముందుకు వెళ్లారు ఎన్టీఆర్. అలా కాకుండా ప్రత్యర్దులకున్న అంగ, ఆర్ధిక బలాలని పూర్తిగా దెబ్బతీస్తూ వ్యూహాత్మకంగా నడుపుకెళ్ళిన వ్యక్తి వైఎస్ అయితే, ప్రత్యర్దులని సర్వనాశనం చేయగల ఎత్తుగడలు వేయడంలో సిద్ధహస్తలు చంద్రబాబు కేసీఆర్. ఈ క్రమంలోనే ప్రతీకార రాజకీయల సందర్భాలు నడుస్తున్నాయిపుడు. ఇలాంటి నేపధ్యంలో తన బలాన్ని పెంచుకుకోవడం, ప్రత్యర్ధిని బలహీన పరచడమనే కోణంతో పాటుగా తన బలహీనతల్ని మరొకరిపై తోసేయడంలో కూడా చంద్రబాబు నైపుణ్యం విభిన్నం.

చంద్రబాబు బలాలు :

చంద్రబాబుకి రెండు బలాలు. ఒకటి కార్యకర్తలైతే రెండు మీడియా. ఈ రెండు కాంబినేషన్లో వేసుకుంటున్న స్కెచ్ లో 100సీట్లకి పైగా సాధిస్తామన్నది చంద్రబాబు లెక్క. ఈ విషయంలో చంద్రబాబు వేసుకున్న స్కెచ్ కోటి యాబై లక్షల మందికి పధకాల్ని చేర్చడం. ఒకటి.. డ్వాక్రా మహిళలు దాదాపు 90 లక్షల మంది వున్నారు. వీళ్ళందరికి ఒక పదివేల రూపాయిల చెక్ వేశాం. ఇంకొ పదివేలు మళ్ళీ వేస్తామని చెబుతున్నారు. అంటే ఈ లెక్కన బాబు మళ్ళీ వస్తేనే పదివేలు. ఇదే ప్రచారం మౌత్ పబ్లిసిటీలోకి తీసుకువెళతారు. బాబు మళ్ళీ వస్తేనే డబ్బులు వస్తాయని ప్రచారం కల్పిస్తారు. అలాగే పించన్లు. యాబై నాలుగు లక్షల మందికి పెన్షలు రెండు వేల రూపాయిలు చేయడం. ఇక్కడ కూడా మళ్ళీ బాబు వస్తేనే అది సాధ్యం అవుతుంది లేకపోతే సాధ్యం కాదని జనాల్లోకి తీసుకువెళ్ళడం. ఈ ప్రచారం గ్రౌండ్ లెవల్ లో వున్న అంగన్ వాడీ కార్యకర్తల నుండి ప్రతి ఒక్కరు చెయ్యాలి. వాళ్లకి కేంద్రం జీతాలు పెంచినా బాబే పెంచారన్న ప్రచారం తీసుకొస్తారు కాబట్టి వాళ్ళని తెలివిగా ప్రచారంలో బాగం చేయడం ఒక ఎత్తుగడ.

తటస్థుల విషయంలో స్ట్రాటజీ :
20నుండి 40 శాతం తటస్థుల వుంటారు. ఇందులో సగం అంటే 20శాతం మంది ఎవరు గెలుస్తారని అనుకుంటే వాళ్ళకే ఓటేస్తారు. మరోసగం మాత్రం భవిష్యత్ ప్రణాళికలు ఆలోచింది ఓటేస్తారు. వీళ్ళ విషయంలో చంద్రబాబు ఎత్తగడ ఇలా ఉండబోతుంది. ఇప్పటివరకూ కొంత జరిగి మధ్యలో ఆగిపోయిన పనులని చూపించి మోడి సపోర్ట్ లేకపోవడం ఆగింది కానీ బాబు మళ్ళీ వస్తే ఆంధ్రప్రదేశ్ అమెరికా అయిపోతుందని, బాబు వస్తేనే అది సాధ్యపడుతుందని తటస్థులలోకి తీసుకెళ్లడానికి తెలుగుదేశం సోషల్ మీడియా వింగ్ ఒక విస్తృతమైన ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసి ఆ దిశగా ప్రచారం చేయడం.

ఇదీ 100సీట్ల లెక్క :
ఇవి కాకుండా కాపు కార్పోరేషన్, బ్రాహ్మణ , బీసి, ఎస్సి, ఎస్టీలలకి ఇచ్చిన నిధులు.. అంటే ఇందులో కేంద్రం ఇచ్చినవి కూడా ఉండవచ్చు.. అయితే అది కూడా బాబుగారి ఖాతలోనే క్రెడిట్ పడేలా మీడియాలో ప్రాజెక్ట్ చేస్తున్నారు. చేయబోతారు కూడా. కోటి యాబై లక్షల మందికి పధకాల్ని చేర్చడం., చంద్రబాబే దిక్కని తటస్థులకి చూపడం, దీంతోపాటు ప్రతిపక్షాలని దొంగలుగా చూపించడం, అసమర్ధులుగా చిత్రీకరించే ఎత్తుగడ. దీనికి ఎలాగో మీడియా ప్రోజక్షన్ వుంటుంది. ఈ అన్ని కోణాల్లో చూస్తే వంద సీట్లకి పైగా గెలవగలమని తెలుగుదేశం పార్టీ అంచనా వేసుకుంటుంది. మరి ప్రజల నిర్ణయం ఎలా వుంటుందో చూడాలి.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.