జ‌గ‌న్ హ‌డావుడికి దూరం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు దగ్గర పడుతుంది. మరో 12 రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రి ఎవరో తేలనుంది. పోలింగ్ తర్వాత అన్ని పార్టీల;యూ హడావిడి చేసాయి. ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేసారు. అయితే ప్రస్తుతం మాత్రం జగన్ ఎలాంటి హడావిడి చేయడం లేదు. ఓ పక్క తెలుగుదేశం అధినేత చంద్రబాబు దగ్గరికి కొంతమంది అధికారులు వెళ్లి మీరే ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పడం..ప్రమాణ స్వీకారానికి సిద్ధం కండి అని మాట్లాడుకోవడం వంటివి చేస్తున్నారని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. పోలింగ్ తర్వాత రెండు రోజులు పార్టీ నేతలతో మాట్లాడడం..కిషోర్ ను కలవడం వంటివి చేసాడు కానీ ఆ తర్వాత మాత్రం తన పనుల్లో తాను బిజీ అయ్యాడు.

జగన్ ఏ హడావిడి చేయకపోయేసరికి తెలుగుదేశం నేతలు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. జగన్ ఓటమిని అంగీకరిస్తున్నారని..అందుకే ఎలాంటి హడావిడి చేయడం లేదని వాపోతున్నారు. జగన్ మాత్రం ఫలితాలకు ముందే ఏ హడావిడి చేయవద్దని..ఫలితాలు వచ్చాక అన్ని చూసుకుందాం అన్నట్లు తెలుస్తుంది.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.