కేసీఆర్ గాలి తీసిపారేసిన స్టాలిన్‌..

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో గత మూడు నెలలుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలామంది దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ కేసీఆర్ కు పెద్ద షాకే ఇచ్చాడు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సుమారు ఇరువురు నేతల మధ్య గంటన్నర పాటు చర్చ జరిగింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చెప్పి, జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ వస్తే ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటాయని చెప్పి ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కోరారు.

అయితే కేసీఆర్ ప్రతిపాదనను స్టాలిన్ తిరస్కరించారు. తాము బీజేపీయేతర కూటమిలో ఉన్నామని , అవకాశం ఉంటే తమరు కూడా బీజేపీయేతర కూటమిలో చేరాలని , తమ మద్దతు ప్రకటించాలని స్టాలిన్ కేసీఆర్ ను కోరారు. దీంతో కేసీఆర్ కు స్టాలిన్ పెద్ద షాక్ ఇచ్చినట్టు అయ్యింది.