యూపీ మోడీవైప‌న్న ఎన్డీటీవీ

ఎన్డీటీవీ అంటే బీజీపీ పార్టీ యాంటీ అంటారు..కానీ ఆ ఛానల్ వారే ఇప్పుడు బీజీపీ ఫై పాజిటివ్ ప్రచారం చేయడం పట్ల అందరూ ఆశ్చర్య పోతున్నారు. తాజాగా ఎన్డీటీవీ ఓ విశ్లేషణ చేసింది. అందులో ఢిల్లీలో అధికారానికి యూపీయే దారి అని..దేశంలోనే అత్యధిక నియోజకవర్గాలు- 80 ఉన్న ఈ రాష్ట్రం బీజీపీ పార్టీ వైపు మొగ్గు చూపించిందని..తెలిపింది.

కాంగ్రెస్ తమ కూటమిలో చేర్చుకోకపోవడం వల్ల ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ భారీగా దెబ్బతినే అవకాశం ఉంది. ప్రియాంక గాంధీని రంగంలోకి దింపడం.. మాయావతి, అఖిలేశ్‌ దీన్ని ఊహించలేదు. కాంగ్రెస్‌ సామాజికంగా గట్టి అభ్యర్థులను నిలబెట్టడం, ప్రియాంక ఉధృతంగా ప్రచారం చేయడంతో పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్‌ గణనీయంగా ఓట్లు చీల్చేస్థాయికి వెళ్లడం, ఆ ఓట్లు కూడా ఎస్పీ, బీఎస్పీవే కావడంతో మహాకూటమి అభ్యర్థుల విజయావకాశాలు తీవ్రంగా దెబ్బతినే స్థితి నెలకొంది.ఈ చీలిక వల్ల బీజేపీయే లాభపడబోతోందని ఎన్‌డీటీవీ అంచనా. .

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.