ప‌వ‌న్ పాట అంత‌ర్జాతీయ అవార్డు తెచ్చింది

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..ఓ ఇంటర్నేషనల్ చానల్‌లో వరల్డ్ ఆఫ్ డాన్స్ అనే రియాల్టీ షోను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జెన్నిఫర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. దకింగ్స్ అనే గ్రూప్ నేమ్‌తో కుర్రాళ్ల టీం డాన్స్ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలోని ‘వాడెవన్నా వీడెవన్నా’ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు భారత యువకులు. సర్దార్ పాటకు ‘300’ అనే సినిమా కాన్సెప్ట్‌ను మిక్స్ చేశారు. వీళ్లు డాన్స్ చేసినంత సేపు షో మొత్తం ఒకటే హడావుడి కనిపించింది. షోలో పాల్గొన్న ప్రేక్షకులతో పాటు… జడ్జీలు సైతం కుర్రాళ్ల స్టెప్పులకు మంత్రముగ్ధులైపోయారు. వీళ్ల పెరఫామెన్స్ ముగియగానే.. జెన్నిఫర్ నిలబడీ మరీ చప్పట్లు కొట్టారు.

‘ద కింగ్స్’ బృందం ప్రదర్శించిన థ్రిల్స్, స్టెప్పులు చూసి చూసి ఈ పాప్ డాన్సర్ తన ఎమోషన్ కంట్రోల్ చేయలేకపోయింది. తన సీట్లోంచి పైకి లేచి మరీ ‘ద కింగ్స్’ ప్రదర్శన పట్ల జోరుగా చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.