శివాజీకి చిక్కులు – సమాధానం ఇస్తారా.?

వెండితెర ఫై చిన్న చిన్న క్యరెక్టర్లు వేసి ఆ తర్వాత హీరోగా రెండు మూడు సినిమాలు చేసిన శివాజీ..సినిమాలను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ ని గెలిపించడం కోసం నానా సర్వేలు ఆపరేషన్ గరుడ..మొదలు పేర్లతో మోడీ ఏం చేస్తున్నాడో..బాబు ఏం చేయబోతున్నాడో ఇలా చెప్పి మీడియా లో కలరింగ్ ఇచ్చిన శివాజీ..ఇప్పుడు ఫోర్జరీ సంతకాల కేసులో చిక్కుకొని అజ్ణాతంలో ఉండిపోయాడు. నిన్నటి వరకు జగన్ జైలు కు వెళ్లడం ఖాయం అంటూ చెప్పుకొచ్చిన శివాజీ..ఇప్పుడు అదే జైలు కు వెళ్లబోతాడా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

ఏప్రిల్‌ 24న పెట్టిన మొదటి కేసులో రవిప్రకాశ్‌ నటుడు శివాజీతో కలిసి ఆయనకే షేర్ల జారీకి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించారనే ఆరోపణను ఎదుర్కొంటున్నారు. మరి ఈ కేసు నుండి శివాజీ ఎలా బయటపడతాడు..అనేది చూడాలి.