మ‌హానాడు ఆగింది మ‌హా సంక్షోభం

ప్రతి ఏడూ ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మే 27 నుంచి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుక ఏడాది వాయిదా పడింది. ఈ వాయిదా ను తెలుగుదేశం పార్టీ చాల లైట్ గా తీసుకున్నప్పటికీ ఓ వర్గం మాత్రం పార్టీ నిర్ణయం ఫై అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అలాగే తెలుగుదేశం కార్య కర్తల్లోనూ మింగుడు పడడం లేదు.

ఫలితాలు ఈ నెల 23న వెల్లడికానున్నందున 27న నిర్వహించాల్సిన మహానాడుకు సమయం సరిపోదని అందుకే మహానాడు వాయిదా వేశామని చెపుతున్నారు. కానీ ఫలితాలు 23 వస్తే 27 న జరగాల్సిన మహానాడు కు సంబంధం ఏంటి..? ఒకవేళ ఫలితాల్లో విజయం సాధిస్తే ఇంకాస్త సంబరంగా ఈ వేడుక జరపొచ్చు కదా..అదే వేదిక ఫై మంత్రి వర్గ విస్తరణ చేయచ్చు కదా..

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.