అల్లు అర్జున్ ‘అద్దిరిపోయింది’.. ఎలగెలగా..

అల్లు అర్జున్ ఇప్పుడు ట్రోల్స్ బారిన పడ్డాడు. దీనికి కారణం  చావు కబురు చల్లగా అనే సినిమా.  ప్రీ రిలీజ్ కబురు చల్లగా అనే సినిమాని ఆకాశానికి ఎత్తాడు బన్నీ. ‘తాను చూసాను..అద్దిరిపోయింది. మీరు చూడండి మీకూ నచ్చుతుంది”అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు బన్నీ.

బేసిగ్గా…  పెద్ద హీరోలు సెలబ్రిటీలు సినిమా ఫంక్షన్లకు వచ్చినా, సినిమా ను చూడండి..మీకు నచ్చుతుంది..బాగుంటుంది  చెప్పరు. తేడా కొడితే మళ్ళీ ట్రోల్ అయిపోతారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే పరిస్థితి వచ్చంది. చావు కబురు చల్లగా సినిమా డిజాస్టర్ గా నిలిచింది.  విడుదలైన మొదటి ఆట నుండే సినిమా జాతకం తెలిసిపోయింది. గీతా ఆర్ట్స్ లో ఈ మధ్య కాలంలో ఇంత డిజాస్టర్ లేదు. అంతేకాదు పరమ చెత్త సినిమా రికార్డ్ కూడా దక్కించుకుంది.

తల్లి కొడుకు కలిసి మందు కొట్టడం, తల్లికి వేరే అతనితో అక్రమ సంబంధం వుండడం లాంటి దారుణమైన పాయింట్ జనం యాక్సెప్ట్ చేయలేకపోయారు.  ఇలాంటి సినిమా బన్నీకి ఎలా నచ్చింది. ఒకవేళ సొంత బేనర్ సినిమాని ప్రమోట్ చేసే పని .. బావుందని అనొచ్చు .. అంతేగానీ అద్దిరిపొయిందనే కామెంట్ మాత్రం కొంచెం అతి గా అనిపించింది ఇప్పుడు. అందుకే ‘అద్దిరిపోయింది’.. ఎలగెలగా.. అని మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.