ఆచార్యని భయపెడుతున్న ‘కామ్రేడ్’

నిన్న రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా `ఆచార్య`లోని `సిద్ధ` లుక్‌ని  విడుద‌ల చేశారు. అయితే ఈసారి చ‌ర‌ణ్ సోలోగా రాలేదు. చిరుకి తోడుగా వ‌చ్చాడు. చిరంజీవి – కొర‌టాల కాంబినేష‌న్ లో రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో చ‌ర‌ణ్ `సిద్ద‌`గా క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

చిరు – చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో కొన్ని కీల‌క‌మైన సన్నివేశాలుంటాయి. `సిద్ధ‌`గా చ‌ర‌ణ్ సోలో లుక్ ని విడుద‌ల చేస్తారేమో అనుకుంటే.. చిత్రృందం షాకిచ్చింది. ఓ మెగా పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది. `ధ‌ర్మానికి ధైర్యం తోడైన వేళ‌` అంటూ కొర‌టాల ఈ ఫొటోకి ట్యాగ్ లైన్ జోడించాడు. న‌క్సల్ గెట‌ప్‌, చేతిలో తుపాకులు, తీక్షణ‌మైన చూపుల‌తో.. తండ్రీ కొడుకులిద్దరూ క‌ద‌న రంగంలోకి దిగుతున్నట్టున్న ఫోజు అది.   మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్ లా ఉంది.  ఐతే ఇక్కడ సెంటిమెంట్ భయపెడుతుంది. బేసిగ్గా నక్సలిజ్, కామ్రేడ్ టచ్ ఉన్న సినిమాల జమానా ముగిసిపోయింది. ఇప్పుడు నేపధ్యాలు వర్క్ అవుట్ కావడం లేదు. మరి ఆచార్య విషయంలో ఏమౌతుందో చూడాలి.