‘ఆచార్య’ ఇలా షాక్ ఇచ్చాడేంటి ?

‘ఆచార్య’ నుంచి మొదటి సాంగ్‌ లిరికల్‌ వీడియో వచ్చేసింది. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ‘లాహే లాహే..’అంటూ సాగుతున్న  పాటలో  ముఖ్యంగా మణిశర్మ తన మార్కు మెలోడి డ్యాన్సింగ్‌ బీట్స్‌తో మోతెక్కించారు. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ పాటను హారిక నారాయణ్‌, సాహితి చాగంటి ఆలపించారు.

సాధార‌ణంగా..  అగ్ర హీరో సినిమా నుంచి వ‌చ్చే తొలి పాట‌.. హీరోయిజం చుట్టూ తిరుగుతుంది. ఓ ర‌కంగా అదే హీరో ఇంట్రడ‌క్షన్ సాంగ్ అయ్యింటుంది. `లాహే.. లాహే` కూడా అలాంటి పాటే అనుకున్నారు. పైగా చిరు స్టెప్పుల‌తో క‌ట్ చేసిన ప్రోమో చూసి గ‌ట్టిగా ఫిక్సయిపోయారు. అలాంటి వాళ్లంద‌రికీ `లాహే… లాహే` స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇది హీరోయిజం నిండ‌దిన పాట కాదు. శివుడిపై సాగే ఓ గీతం.  = మ‌ధ్య‌లో వ‌చ్చిన చిరు..  కొన్ని స్టెప్పులు వేశారు. కాజ‌ల్ కూడా క‌నిపించ‌నుంది. `ఆచార్య‌` నుంచి ఓ మంచి ఆల్బ‌మ్ రాబోతోంద‌ని తొలి పాట‌తోనే మ‌ణిశ‌ర్మ హింట్ ఇచ్చారని చెప్పొచ్చు.