ఆర్ఆర్ఆర్ .. షాకింగ్ బిజినెస్

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఆలియా భట్‌, ఓలివియా మోరిస్‌ కథానాయికలు. చారిత్రక పాత్రలకు ఫిక్షనల్‌ స్టోరీ జోడించి జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, ఆయన జోడీగా అలియా భట్‌ నటిస్తోంది. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తుండగా.. ఆయనకు జోడీగా హాలీవుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ సందడి చేయనుంది.

కాగ తాజా ఈ సినిమా  ప్రీ-రిలీజ్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యింది.   కేవలం 5 భాషలకు సంబంధించి 348 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసింది యూనిట్.  ఈ సినిమాను ఒకేసారి 11 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ ఐదు భాషలకు కలిపి 348 కోట్లని టాక్. మొత్తానికి ఆర్ఆర్ఆర్ రికార్డుల మోత మొదలైంది.