‘గీతా ఆర్ట్స్’ పరువు తీసిన అక్రమ సంబంధం !

గత వారం వచ్చిన సినిమాల్లో చావు కబురు చల్లాగా సినిమా కూడా వుంది. గీతా ఆర్ట్స్ నిర్మాణం. బేసిగ్గా గీతా ఆర్ట్స్ అనగానే పాజిటివ్ అంచనాలు వుంటాయి. ఎందుకంటే అల్లు అరవింద్ జడ్జిమెంట్ పై ఒక నమ్మకం. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు.  విడుదలైన మొదటి ఆట నుండే సినిమా జాతకం తెలిసిపోయింది. డిజాస్టర్ రిజల్ట్. గీతా ఆర్ట్స్ లో ఈ మధ్య కాలంలో ఇంత డిజాస్టర్ లేదు. అంతేకాదు పరమ చెత్త సినిమా రికార్డ్ కూడా దక్కించుకుంది.  

ప్రస్తుతం కొత్త పాయింట్లుని చూస్తున్నారు జనాలు. ఉప్పెన కధ పాతది అయినా మగతనం తీసేయడం అని ఎదో సినిమా కధ చెప్పారు. కొందరు బాగానే కనెక్ట్ అయ్యారు. ఐతే చావు కబురులో కూడా కొత్త పాయింట్ వుంది. ఐతే ప్రేక్షకులు దిన్ని చెత్త పాయింట్ గా తీసి పారేశారు. తల్లి కొడుకు కలిసి మందు కొట్టడం, తల్లికి వేరే అతనితో అక్రమ సంబంధం వుండడం లాంటి దారుణమైన పాయింట్ జనం యాక్సెప్ట్ చేయలేకపోయారు. మొత్తానికి గీతా కెరీర్ లో పరమ చెత్త సినిమాగా నిలిచిపోయింది.