థియేటర్ లో ప్రేమ వర్షం !

సాయి పల్లవి మంచి డ్యాన్సర్. ఇప్పటికే ఆమెకు మిలియన్ హిట్స్ వుండే సాంగ్స్ వున్నాయి. ఇటివలే వచ్చిన ఈమ‌ధ్య విడుద‌లైన‌… లవ్ స్టొరీ నుండి `సారంగ ద‌రియా` పాట‌.. ఓ ఊపు ఊపేసింది. యూ ట్యూబ్ లో ఆ పాట సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

ఇప్పుడు అదే సినిమా నుండి మ‌రో పాట బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదే.. ఏవో ఏవో క‌ల‌లే. మెలోడీ బీట్ తో మొద‌లై.. ఫాస్ట్ బీట్ లోకి మ‌ళ్లి.. ఓ ప్ర‌వాహంలా సాగిన గీత‌మిది. ప‌వ‌న్ సంగీతం అందించారు. భాస్క‌ర భ‌ట్ల ర‌వికుమార్ సాహిత్యం స‌మ‌కూర్చారు. ` జోనితా గాంధీ. న‌కుల్ అభ‌య‌న్‌కర్… ఈ పాట‌ని ఆల‌పించారు.

`ల‌వ్ స్టోరీ` ఆల్బమ్ లోని మిగిలిన పాట‌ల‌తో పోలిస్తే… ఈ పాట కొత్త త‌ర‌హాలో ఉంది.  వర్షం పాట చూసి చాలా కాలం అయ్యింది . ఈ వర్షం పాటకు థియేటర్ లో విజల్స్ వర్షం కురవడం గ్యారెంటీలా కనిపిస్తుంది.