నయన్ సీక్రెట్ గా కానించేసిందా ?

నయన్‌ తార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్.  ‘నేను రౌడీ నే’ సమయంలో విఘ్నేశ్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. నయన్‌పై తనకున్న ప్రేమను విఘ్నేశ్‌ పలు సందర్భాల్లో సోషల్‌మీడియా వేదికగా తెలియజేశాడు.

కాగా, తాజాగా ఆయన ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్‌ చేశారు. అందులో నయన్‌ చేతికి ఉన్న ఉంగరం చూసి.. ఈ జంటకు నిశ్చితార్థమైందని అందరూ భావించారు. కంగ్రాట్స్‌ చెబుతూ కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే, నయన్‌ వేలికి ఉన్న ఆ ఉంగరం.. గతేడాది విఘ్నేశ్‌ షేర్‌ చేసిన చాలా ఫొటోల్లో కనిపించింది. దీంతో ఈ జంటకు నిశ్చితార్థమైందా?లేదా?అనుకుంటున్నారు నెటిజన్లు.

మొత్తానికి  ఈ ఏడాదిలోనే నయనతార-విఘ్నేష్ పెళ్లి చేసుకునేలా ఉన్నారు. ప్రస్తుతం నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉంది. సౌత్ లోనే అత్యథిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా ఆమె గుర్తింపు తెచ్చుకుంది.