నితిన్ వెర్సస్ రానా.. బాక్సాఫీసు వార్

ఈ వారం మూడు సినిమాలు వస్తున్నాయి. `రంగ్ దే`, `అర‌ణ్య‌`, `తెల్ల‌వారితే గురువారం`…. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఢీ కొట్ట‌బోతున్నాయి. ఐతే ఇందులో రానా- నితిన్ కు మధ్యే పోటి కనిపిస్తుంది. నితిన్ – కీర్తి కాంబినేష‌న్ లో రూపొందిన చిత్రం `రంగ్ దే`. `తొలి ప్రేమ‌`లాంటి రొమాంటిక్ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. ప్ర‌చార చిత్రాలు, పాట‌లూ బాగున్నాయి. దాంతో ఈసినిమాపై అంచ‌నాలు పెరిగాయి.

బాహుబ‌లి త‌ర‌వాత అంత‌గా క‌ష్ట‌ప‌డిన సినిమా ఇదంటూ `అర‌ణ్య‌` గురించి రానా గొప్ప‌గా చెబుతున్నాడు. ఆ క‌ష్టం టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌లో క‌నిపిస్తోంది. అట‌వీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది.  పాన్ ఇండియా స్థాయిలో రూపొందిచ‌న సినిమా ఇది. మ‌రి బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఎలాంటి ఫ‌లితాన్ని తీసుకొస్తుందో చూడాలి. కీర‌వాణి త‌న‌యుడు సింహా క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా `తెల్ల‌వారితే గురువారం`.  ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కానీ హిట్ టాక్ వస్తే మాత్రం జనాలు రావడం పెద్ద విషయం కాదు.