ప్రభాస్ కొత్త కారు ధర ఎంతో తెలుసా ?

ప్రభాస్‌  సంబంధించిన కొత్త ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. ఇటీవల ప్రభాస్‌ అత్యంత ఖరీదైన లంబోర్గిని ‘అవెంటిడోర్‌ రోడ్‌స్టర్‌’ కారును కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. ఇంతకీ ఈ కారు ఖరీదు ఎంతో తెలుసా..  అక్షరాల రూ.6కోట్లు.

తన తండ్రి సూర్యనారాయణరాజు జయంతిని పురస్కరించుకుని ప్రభాస్‌ ఈ కారును కొనుగోలు చేశారు.  ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్‌’, ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌’, ఓం రౌత్‌తో ‘ఆది పురుష్‌’తో పాటు, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు కూడా సెట్స్ పై వున్నాయి.