బాలయ్య, ఎన్టీఆర్.. ఓ రూమర్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఓ సినిమా తెరకెక్కుతుంది. పూర్ణ, ప్రగ్య జైస్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా కనిపించనున్నారు.    మే 28 న ఎన్టీఆర్ జయంతి సందర్భం గా విడుదల కానుంది. ఈ చిత్ర నిర్మాతలు తమ సినిమా టైటిల్‌ను ఇప్పటివరకు వెల్లడించలేదు.

తాజాగా ఈ సినిమాపై ఓ రూమర్ తెరపైకి వచ్చింది.  ఉగాది స్పెషల్ గా సినిమా టైటిల్ ని ప్రకటించాలని యోచిస్తున్నారు. దానిని మరింత ప్రత్యేకమైనదిగా చేస్తూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ టైటిల్ను వెల్లడిస్తారని టాక్ వినిపిస్తుంది. అది నిజంగా జరిగితే, అది నందమూరి అభిమానులకు పందంగే అవుతుంది. ఐతే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

 కాగా  జూన్‌లో విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం పై  అంచనాలు భారీఅంచనాలు వున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం కంపోజ్ చేస్తున్నారు.