మార్చిలో టాలీవుడ్ ఫెయిల్ !

మార్చిలో దాదాపుగా 20 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ సినిమాల రిజల్ట్ చూసుకుంటే పాస్ మార్కులు కూడా పడలేదు.  ఒక్క  ‘జాతి ర‌త్నాలు’ తప్పా మిగతా సినిమాలన్నీ డిక్కీ కొట్టేశాయి.  శ్రీ‌కారం, గాలి సంప‌త్, చావు క‌బురు చ‌ల్ల‌గా, మోస‌గాళ్లు, పవర్ ప్లేయ్, `తెల్లవారితే గురువారం, అరణ్య ఇలా  సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.

మధ్యలో వచ్చిన సందీప్ కిషన్  ఏ 1 ఎక్స్‌ప్రెస్‌` ఓకే అనిపించుకుంది.  దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన చిన్న సినిమా `షాదీ ముబార‌క్‌` ఫెయిల్ . రాజ్ తరుణ్ `పవ‌ర్ ప్లే`ది కూడా ఇదే పరిస్థితి. మార్చి ఆఖ‌రి వారంలోనూ  మూడు సినిమాలు అందులో రంగ్ దే ఒక‌టి. నితిన్ – కీర్తిల సినిమాకు మంచి ఓపెనింగ్స్ ల‌భించాయి. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ తెచ్చుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు తేల్చేశాయి.

రాజ‌మౌళి ఫ్యామిలీ సపోర్ట్ తో వచ్చిన  `తెల్ల‌వారితే గురువారం` క‌నీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక‌పోయింది. ఇక రానా చాలా క‌ష్ట‌ప‌డి చేసిన `అర‌ణ్య` కూడా  ఫ్లాఫ్ బాట పట్టింది, మొత్తానికి చూసుకుంటే జాతి రత్నాలు ఒక్క సినిమా మాత్రమే నిఖార్సయిన హిట్ అనిపించుకుంది. రంగ్ దే యావరేజ్ గా నిలిచింది. ఈ లెక్క చూసుకుంటే మార్చిలో టాలీవుడ్ కి పాస్ మార్కులు కూడా పడలేదు.