వకీల్ సాబ్… హీరోయిజం కట్ !

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ ట్రయిలర్ నిన్ననే వచ్చేసింది. ఈ సినిమా గురించి తెలియని చాలా మంది అసలు ఇందులో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ హీరోయిజమో అని వూహిం చుకున్నారు. కానీ వకీల్ సాబ్ యూనిట్.  ట్రయిలర్ లో హీరోయిజం తగ్గించింది. కారణం నిజానికి ఇది పవన్ కళ్యాణ్ మీద నడిచే సినిమా కాదు. అమ్మాయిలు ప్రస్తుతం ఎదురుకుంటున్న ఓ బర్నింగ్ ఇష్యూ మీద నడిచే కధ. అందుకే అమ్మాయిల మీద ఓపెన్ అయ్యింది.  

ఐతే పవన్ పాయింట్ లో కొన్ని డైలాగులు పేలాయి. అమ్మాయిని మీరు వర్జిన్ నా అని అడిగినపుడు అబ్బాయిని అడగకూడదా? అన్న యాంగిల్ లో డైలాగు పడింది. ‘ఇదెక్కడి న్యాయం నందాజీ’ అని పవన్ అనడం ఆయన స్టయిల్ ను గుర్తుకు తెచ్చింది.  పింక్ రీమేక్ ను సిన్సియర్ గా చేస్తున్నామన్న కలర్ ను ట్రయిలర్ తెచ్చింది.  ఇది ఒక విధంగా మంచింది. లేదంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని హీరోయిజం పీక్స్ లో ఊహుంచుకొని తీరా థియేటర్ లోకి వెళ్లి దిస్సాపాయింట్ అయ్యే ఛాన్స్ వుంది. అందుకే చాలా తెలివిగా ట్రైలర్ టాక్ చేశారు.