6 టీన్స్ మూవీ సీక్వెల్ ‘రిస్క్’ మోషన్ పోస్టర్


ఇరవైఏళ్ళ క్రితం “దేవుడు వరమందిస్తే… నిన్నే కోరుకుంటాలే!” అనే గీతం అప్పటి యూత్ ని విశేషంగా ఆకట్టుకుని సంచలనం సృటించింది. మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ స్వరపరిచిన ఆ పాట సిక్స్ టీన్స్ చిత్రంలోనిది. అయితే సిక్స్ టీన్స్ సీక్వెల్ గా ప్రస్తుతం ఘంటాడి కృష్ణ పాన్ ఇండియా మూవీని, రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘రిస్క్’ అనే మూవీ నిర్మించారు. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ధమాకా దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన నిన్న జనవరి 21న శనివారం సాయంత్రం 05:05 గంటలకు విడుదల చేసారు. ఘంటాడి కృష్ణకు చిత్ర బృందానికి అల్ ది బెస్ట్ చెప్పడంతో పాటు సినిమా అన్ని భాషల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. ” ఘంటాడి కృష్ణ గారి పాటలంటే నాకు ఎంతో ఇష్టం సంపంగి చిత్రంలో సాంగ్స్ ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. దేవుడు వరమందిస్తే… నిన్నే కోరుకుంటాలే! పాటతో అయన కన్నడ పరిశ్రమలో కూడా గుర్తింపు పొందాడు. ఆయన స్వీయ దర్శకత్వం లో అందిస్తున్న ‘రిస్క్’ లో కూడా పాటలు బాగుంటాయని అనుకుంటున్నాను. ఈ రోజు విడుదల చేసిన రిస్క్ మోషన్ పోస్టర్ కూడా అద్భుతంగా వుంది. ఒకే సారి నాలుగు భాషల్లో విడుదల చేయడం అభినందనీయం” అన్నారు.

హీరో గా పరిచయం అవుతున్న సందీప్ అశ్వా మాట్లాడుతూ…” రిస్క్ చిత్రంతో నన్ను హీరోగా పరిచయం చేసిన ఘంటాడి కృష్ణ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా నేటి జనరేషన్ కి సంబందించిన కథ, అత్యాశకు పోయి అక్రమార్గంలో డబ్బు సంపాదించాలనుకునే నలుగురు యువకులు ఎలాంటి రిస్క్ లో ఇరుక్కున్నారో? ఆ తరువాత రియలైజ్ అయ్యి ఏ విధంగా బయటపడ్డారన్నది ప్రధాన ఇతివృత్తం.