30న ‘ఆగడు’ ఆడియో

agadu-audio-release-date
మహేష్ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న ‘ఆగడు’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 30న ‘ఆగడు’ ఆడియోని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు హైదరాబాదులోని శిల్పకళావేదిక ఆడిటోరియంలో ముస్తాబువుతోంది. ప్రస్తుతం ఆగడు ఆఖరు షెడ్యుల్ స్విట్జర్లాండులో జరుగుతోంది. మహేష్-తమన్నాలపై సాంగ్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఆగస్టు 30తో చిత్రీకరణ పూర్తికానుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు. సంగీతం థమన్. అన్నట్టు.. ఆగడు దసరా కానుకగా.. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.