ఏజెంట్’ నుంచి మాంచి రొమాంటిక్ నెంబర్

అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ నుంచి మాంచి రొమాంటిక్ నెంబర్ బయటికి వచ్చింది. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించిన చిత్రం నుంచి ‘ఏందే ఏందే’ పాటని విడుదల చేశారు . ఈ పాటని లవ్లీ రొమాంటిక్ మెలోడీగా కంపోజ్ చేశారు.

చంద్రబోస్ ఈ పాటకు రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ యాస పదాలతో ప్రేమ పాటని చక్కగా రాశారు . ఈ పాటలో అఖిల్, సాక్షి వైద్య ల కెమిస్ట్రీ చాలా బావుంది అందమైన ఫారిన్ లోకేషన్స్ లో పాటని షూట్ చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వచిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.