వన్నె తగ్గని ‘ఐశ్వర్యం’

rai
నాలుగు పదుల వయసులోనూ వన్నె తగ్గని అందం ఐశ్వర్యారాయ్‌ సొంతం. ఫార్టీ ప్లస్‌లోకి అడుగు పెట్టినా ఐశ్వర్యారాయ్‌లో అందం ఏమాత్రం తగ్గలేదు. అందుకు తాజా నిదర్శనం కేన్స్‌ ఫెస్టివల్. గత కొన్నేళ్ళుగా ‘కేన్స్‌’లో ఐశ్వర్యారాయ్‌ సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అవుతూ వసున్న ఐష్‌.. ఈ యాడాది అదరగొట్టేసింది. అందాల ఐశ్వర్యాన్ని చూసి గ్లామర్ వరల్డ్ మరోసారి మురిసిపోయింది. నిన్న కేన్స్‌లో జరిగిన స్లాక్‌ బే చిత్ర ప్రీమియర్‌ షోకు హాజరైనఐష్‌.. బంగారు వర్ణంలో మెటాలిక్‌షీత్‌లో మిరుమిట్లు గొలిపే గోల్డ్‌ కేప్‌ గౌన్‌లో రెడ్ కార్పెట్ పై అదరగొట్టేసింది. ఈ తరం హీరోయిన్లు ఇదే కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌ మీద హొయలొలిగిస్తున్నా ఐష్‌ ముందు తేలిపోతున్నారని కితాబిచ్చేస్తున్నారు సినీ జనాలు.