అఖండ టాక్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ ను దాటడం ఈజీ

బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. బాలకృష్ణ కెరీర్ లో అతిపెద్ద రిలీజ్ గా అఖండ నిలిచింది. ఈ మధ్య కాలంలో బాలయ్య మూవీకి ఈ స్థాయి ప్రచారం దక్కలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ సైతం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. వీరిద్దరి కలయికలో ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చి బ్లాక్క్ బస్టర్ హిట్స్ సాధించడం తో ఈ సారి ఎలాంటి హిట్ అందుకుంటుందో అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ వచ్చారు. వారి ఎదురుచూపులు తగ్గట్లే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ టాక్ తో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ క్రాస్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

మొత్తంగా ఈ సినిమా రూ.54 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తర్వాత ఇంతటి భారీ ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన మొదటి పెద్ద తెలుగు సినిమా ‘అఖండ’నే. ఈ సినిమా ‘అఖండ’మైన విజయం సాధించాలి అంటే ప్రీ రిలీజ్ బిసినెస్ కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టాలి. అంటే దాదాపుగా 60 కోట్ల కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. మొదటి షో నుంచే సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టడం పెద్ద కష్టం ఏం కాదనిపిస్తోంది.