అఖండ సీక్వెల్… స్టోరీ ఇదేనా ?

బాలకృష్ణ – బోయపాటి కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. డిసెంబర్ 02 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ విజయం సొంతం చేసుకుంది. అఖండ చిత్రానికి ముందుగా సీక్వెల్ చేయాలనే ఆలోచన లేనప్పటికీ ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ను చూసిన తరువాత జరిగిన కథలో నుంచి బలమైన ఒక పాయింటును పట్టుకుని అక్కడి నుంచి సీక్వెల్ కి తగిన కథను అల్లుకుంటూపోయే ఆలోచనలో చేస్తున్నారు.

ఇప్పుడు ప్రేక్షకులంతా కూడా సీక్వెల్ కథ ఎక్కడి నుంచి మొదలుకావొచ్చుననే విషయంపై ఆసక్తికరమైన చర్చలు చేస్తున్నారు. ‘అఖండ’లో తన కవల సోదరుడి కూతురికి బాలయ్య ఒక మాట ఇస్తాడు. ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా తనని తలచుకోమనీ .. ఆ వెంటనే తాను ఆమె ముందు ఉంటానని చెబుతాడు. ఈ పాయింట్ నుంచే సీక్వెల్ కథను తీయవచ్చని చెప్పుకుంటున్నారు. కవల సోదరుడి కూతురు పెద్దవడం .. ఆమె ఆపదలో పడటం .. ప్రమాదం మరో వైపు నుంచి రావడం .. ప్రతినాయకుడి స్థానంలో మరొకరు ప్రత్యక్షం కావడం .. ఇలా సీక్వెల్ కూడా ఇంట్రస్టింగ్ గా సాగడానికి తగిన కథ ఉందని అనుకుంటున్నారు.