మొయినాబాద్ రిసార్టులో బాలయ్య – ప్రగ్యా జైస్వాల్

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ. #BB3 టైటిల్ రోర్ అని ఒక వీడియోని యూట్యూబ్ లో వదలగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది, దాంతో ఈ సినిమా టీమ్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తోంది. ఈ చిత్రం ప్రకటించినప్పటినుండి అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి దీనికి కారణం బాలకృష్ణ – బోయపాటి సక్సెస్ కాంబో. వీరిద్దరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు.

ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను వికారాబాద్ అడవుల్లో చిత్రీకరించారు. బాలకృష్ణ – శ్రీకాంత్ తదితరులు పాల్గొనగా, భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా షూటింగు మొయినాబాద్ లో జరుగుతోంది. అక్కడి రిసార్టులో బాలయ్య – ప్రగ్యా జైస్వాల్ కాంబినేషన్ లోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.