అఖిల్ బాగా ఫీలయ్యాడు

akhil (11)
అఖిల్ రెండో సినిమా పై ఓ గాసిప్ వినిపించింది. మొదటి సినిమా అఖిల్ ఎఫెక్ట్ తో దడుసుకున్న నిర్మాతలు, ఇప్పుడు అఖిల్ తో సినిమా అంటే వెనకడుగు వేస్తున్నారని, పైడి పల్లి వంశి రాసుకున్న కధకు 45కోట్ల బడ్జట్ కు కావాలని, అయితే అంత ఎమౌంట్ పెట్టడానికి నిర్మాతలు సాహసించడం లేదనేది ఈ గాసిప్ సారాంశం. దీనిపై అఖిల్ క్లారీటీ ఇవ్వడం జరిగింది.

అయితే ఈ గాసిప్స్ ఆగలేదు. ఇప్పుడు మరో కొత్త గాసిప్. ఈ ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో దర్శకుడు తప్పుకున్నాడని. ఈ గాసిప్స్ తో బాగా ఫీలైన అఖిల్ ఈసారి కాస్తా స్ట్రాంగ్ గానే క్లారిటీ ఇచ్చాడు. ”నా రెండో సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. మీయంతట మీరే ఏవో రాసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. నాకు పీఅర్ టీం వుంది. ఏదైనా వుంటే వారిని సంప్రదించండి. అంతేకాని .. ఇలా ఇష్టం వచ్చినట్లు రాయడం సరికాదు.” అని సినిమాపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టాడు అఖిల్.