నేడు అక్కినేని అంత్యక్రియలు

Akkineni's-cremationనటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు ఈరోజు (గురువారం) మధ్యాహ్నం 3.30గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనున్నాయి. మధ్యాహ్నం 12.30గంటలకు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ నుంచి అక్కినేని అంతిమ యాత్ర పారంభంకానుంది. మధ్యాహ్నం 3.30గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేక ఏర్పాటు చేసిన ప్రదేశంలో అక్కినేని అంత్యక్రియలు జరుగుతాయి. ప్రభుత్వ లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, కడసారి తమ అభిమాన నటుడిని చూడటానికి అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ కి భారీగా తరలివస్తున్నారు.