నేనుపుట్టాను… ఈలోకం ఏడ్చింది

 

manam-sattilights-rights

రీమిక్స్ హ‌వా కొన‌సాగుతోంది. ఆల్‌టైమ్ హిట్ గీతాల్ని మ‌రోసారి రుచి చూపేందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు, సంగీత ద‌ర్శ‌కులు ఉత్సాహం చూపిస్తున్నారు. అక్కినేని గీతాలూ రీమిక్స్‌ల‌తో కొత్త పుంత‌లు తొక్క‌బోతున్నాయి. నాగ‌చైత‌న్య న‌టిస్తున్న ఒక‌లైలా కోసం సినిమాలో.. ఒక‌లైలా కోసం (రాముడు కాదు రాక్ష‌సుడు) పాట రీమిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రేమ్ న‌గ‌ర్‌ లో ‘నేను పుట్టాను.. ఈ లోకం ఏడ్చింది.. ‘ గీతాన్ని రీమిక్స్ చేయ‌బోతున్నార‌ట‌. అక్కినేని క‌థానాయ‌కులు న‌టించిన చిత్రం మ‌నం. అక్కినేని కుటుంబం నిర్మిస్తోంది. విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రేమ్‌న‌గ‌ర్ లోని గీతాన్ని రీమిక్స్ చేశార‌ట‌. అక్కినేని, నాగార్జున‌, చైతూ ముగ్గురు క‌ల‌సి ఈ పాట‌లో ఆడిపాడ‌బోతున్నార‌ట‌. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.