హిందీ లో రిలీజ్ కాబోతున్న అల వైకుంఠపురం లో..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ పాన్ ఇండియా గా విడుదలై అన్ని భాషల్లో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా నార్త్ లో రూ.80 కోట్లు వసూళ్లు చేసి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద బన్నీ సత్తా చాటాడు. ఈ క్రమంలో ఈ నెలలోనే మరో మూవీ తో నార్త్ ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

రెండేళ్ళ క్రితం బన్నీ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా కూడా బన్నీకి అద్భుతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులోని పాటలు, బన్నీ డ్యాన్స్ అభిమానుల్ని ఏ స్థాయిలో అలరించాయో తెలిసిందే. ఈ నెల 26న ఈ సినిమా హిందీ వెర్షన్ ను విడుదల చేయబోతున్నారు. ‘పుష్ప’‌తో బన్నీ తెచ్చుకున్న సూపర్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొన్న మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ప్రత్యేక పోస్టర్ ను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.