Salaar : విడుదలకు ముందు ‘సలార్’ నుండి అదిరిపోయే గిఫ్ట్ !


పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇప్పటికే సలార్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో విడుదలకు ముందు ప్రేక్షకులకు మరో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు చిత్రబృందం. ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ‘ప్రతి కథలో..’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక ఈ సాంగ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందనడంలో సందేహం లేదు. అంతేకాదు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా వుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ డిసెంబర్ 22న ప్ర‌పంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.