అనసూయ ను ఆలా పిలవద్దట..

బుల్లితెర పాపులర్ బ్యూటీ అనసూయ..వెండితెర ఫై కూడా బిజీ నటి అయ్యింది. వరుస సినిమాలతో బిజీ గా ఉంది. ప్రస్తుతం బుల్లితెర ఫై షోస్ చేస్తూనే..మరోపక్క సినిమా షూటింగ్ లు ..ఇంకోపక్క సోషల్ మీడియా లో యాక్టివ్ ఇలా మూడింట్లో బిజీ గా ఉంది. తాజాగా ఈ భామ నెటిజన్ కు దిమ్మతిరిగే కామెంట్ ఇచ్చింది.

సంక్రాంతి సందర్భంగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ‘ఆంటీ లేదా అక్క.. మిమ్మల్ని ఎలా పిలవాలి’ అని ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు.. ‘ఏదీ వద్దు. నన్ను అలా పిలవడానికి నేనెవరో నీకు అంతగా తెలీదు కదా! నీ ప్రశ్న ఏజ్‌ షేమింగ్‌ కింద అనిపిస్తుంది. దీన్ని బట్టి నీ పెంపకం మీద అనుమానం వస్తుంది’ అని ధీటైన జవాబు ఇచ్చింది.

అయితే అను.. ఇచ్చిన జవాబు చాలామంది నెటిజన్లకు నచ్చలేదు. దీనికి మరో నెటిజన్‌ విరుచుకుపడ్డాడు. ‘ఒకరిని అక్క అని పిలవడం ఏజ్‌ షేమింగ్‌ కాదు.. అలాంటప్పుడు కాంప్లిమెంట్స్‌ కూడా తీసుకోవద్దు’ అని కామెంట్‌ చేయగా.. అది చూసిన అనసూయ.. ‘బహుశా ఏజ్‌ షేమింగ్‌ కాకపోవచ్చు కానీ మీరు నా ఉద్దేశాన్ని గమనించండి. నేనేం చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక కాంప్లిమెంట్స్‌ తీసుకోవాలా..? వద్దా..? అనేది ఎవరి ఇష్టం వారిది. ఒక పడవ సముద్రం మీద ఈదగలదు. అదే నావ, సముద్రాన్ని తన లోపలికి రానిస్తే నీట మునిగిపోతుంది. జన సముద్రంతో ఎలా ఉండాలో, ఏది ఎంత తీసుకోవాలో నాకు బాగా తెలుసు’ అంటూ అనసూయ చెప్పుకొచ్చారు. గతంలోలాగా ట్రోలింగ్‌ గురించి, నేను, నా ఫ్యామిలీ అసలు పట్టించుకోవడం లేదు. మేమంతా ఇప్పుడు స్ట్రాంగ్‌ అయ్యాం. ఒకరు మరొకరిని బాధ పెడితే చివరికి వారు కూడా ఆ బాధను అనుభవిస్తారు. కర్మ అనేది ఒకటి ఉంటుందని” అని అనసూయ కాస్త ఘాటుగానే రిప్లయ్ ఇచ్చింది.