మూవీ రివ్వ్యూ : ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’

అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీ మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మళయాళంలో సూపర్ హిట్ అయిన వికృతి మూవీని తెలుగులో రీమేక్ చేశారు.హీరోగా అలీ, హీరోయిన్‌గా మౌర్యాని నటించగా.. అలీ తల్లిదండ్రుల పాత్రలో నరేశ్ పవిత్రలోకేశ్ నటించారు. అలీవుడ్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై శ్రీపురం కిరణ్ ఈ సినిమాను తెరకెక్కించగా కొనతాల మోహన్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. నేటి నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ విషయానికొస్తే..

నరేశ్ (శ్రీనివాస రావు), పవిత్ర (సునీత) పాత్రల్లో భార్యభర్తలుగా నటించారు.వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకుగా హీరో అలీ (మహమ్మద్ సమీర్) పాత్ర చేయగా..కూతురిగా వేరే అమ్మాయి నటించింది. నరేశ్ పవిత్ర దంపతులుగా మెప్పించారు. దుబాయ్ నుంచి వచ్చిన కొడుకు అలీకి సెల్ఫీల పిచ్చి. ఎక్కడ పడితే ఒక్కడ పిక్స్ దిగుతుంటాడు.ఈ క్రమంలోనే దిగిన ఓ సెల్ఫీ వలన మొత్తం కుటుంబం కష్టాల్లోకి వెళుతుంది. ఆసలు ఏం జరిగింది. సంతోషంగా ఉండే కుటుంబం ఎందుకు కష్టాలు పడాల్సి వచ్చిందనేదే సినిమా కథ.

విశ్లేషణ :

అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీని చూసిన వారికి మన కుటుంబంలోని సమస్యలే కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి.ప్రతి ఇంట్లో జరిగే సన్నివేశాల ఆధారంగా సినిమాను తీశారు. మధ్యలో వచ్చే కొన్ని టర్నింగ్ పాయింట్స్, లాస్య పాత్ర వలన సినిమా స్టోరీ మారిపోవడం, అలీ కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్, పవిత్ర లోకేష్ మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకు హైలెట్. ఇక మూవీ ఫస్టాఫ్ ఓకే అనిపించినా సెకండాఫ్ కాస్త బోర్ అనిపిస్తుంది. హీరోహీరోయిన్ మధ్య సీన్స్ లాగ్ అయ్యాయి. పాటలు కూడా పెద్దగా మెప్పించలేకపోయాయి.

ప్లస్ పాయింట్స్ :

అలీ నటన, నరేష్ పవిత్రా లోకేష్ మధ్య ప్రేమ, నమ్మకం..
ఎమోషనల్ సీన్స్, కామెడీ టైమింగ్, టిస్ట్స్

మైనస్..

సంగీతం, సెకండాఫ్ కథ బోరింగ్, కొన్ని సీన్స్ నెమ్మదించడం

తీర్పు :

సినిమాను తొలిసారి చూసిన వారు మంచి అనుభూతిని పొందుతారు. ఇక ఫైట్స్, మాస్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్‌కు ఈ మూవీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్.ప్రేమ సీన్లు కూడా పెద్దగా కలిసిరాలేదు. అలీ నటన, కామెడీ టైమింగ్ మెచ్చుకోవచ్చు. సంగీతం, సెకండాఫ్‌లో కథ నెమ్మదించకపోయి ఉంటే సినిమా బాగుండేది. ఇప్పటికైతే మూవీ టాక్ యావరేజ్ అని వినిపిస్తోంది.