ఆ బ్యూటీ కి పవన్ కళ్యాణ్ తో మాట్లాడటానికి 15 రోజులు పట్టిందట

పవన్‌ కల్యాణ్‌తో సినిమా అనగానే ఎగిరి గంతేశా’ అని అన్నారు నటి అంజలి.  పవన్ కళ్యాణ్ల్‌ సాబ్‌’ ఏప్రిల్ తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ సినిమాలో అంజలి కూడా కీలక పాత్ర చేసింది. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడింది.   ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో పని చేసే అనుభవాన్ని పంచుకుంది. పవన్‌ కల్యాణ్‌తో సినిమా అనగానే ఎగిరి గంతేశా’ అని చెప్పింది.

‘కొత్తలో పవన్‌ కల్యాణ్‌ సర్‌తో మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉండేది. ఎందుకంటే ఆయన సెట్‌లో అడుగుపెట్టగానే అక్కడున్న వారంతా సైలెంట్‌ అయిపోతారు. నేనేమో ఎక్కువ మాట్లాడేస్తుంటా. ఆయన ఏమనుకుంటారో, ఒకే సన్నివేశం మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తే ఏమంటారో అని టెన్షన్‌‌ పడేదాన్ని. అలా ఆయన దగ్గరకి వెళ్లి మాట్లాడటానికి నాకు 15 రోజులు పట్టింది. ఆ తర్వాత అన్ని భయాలు తొలగిపోయాయి. ఆయనతో పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. ఎప్పుడూ ఎవ్వరీకీ చెప్పని పవన్‌.. ‘బాగా చేశారు’ అని నన్ను మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను.” అని తన మనసులో మాట చెప్పింది అంజలి.