చిరు కు జోడిగా జేజమ్మ

చిరంజీవి జెట్ స్పీడ్ లో ఉన్నాడు..వరుస పెట్టి సినిమాలను సెట్స్ పైకి తీసుకొస్తూనే..యంగ్ డైరెక్టర్స్ కథలు వింటూ వారికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. రీసెంట్ గా భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములతో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఇందులో హీరోయిన్​గా అనుష్క ను ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్.

ఇప్పటికే ఆమెను సంప్రదించి కథను కూడా వివరించారని తెలిసింది. కథ నచ్చి అనుష్క కూడా ఓకే చెప్పేందుకు సిద్ధమైందట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. ఇది కనుక నిజమైతే ఫ్యాన్స్​కు పండగే.అంతకుముందు చిరు-అనుష్క కలిసి ‘స్టాలిన్’​ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో కలిసి చిందులేశారు. కాగా, చిరంజీవి.. ప్రస్తుతం ‘గాడ్​ఫాదర్’​, ‘భోళాశంకర్’​, ‘వాల్తేరు వీర్రాజు’ సినిమాల్లో నటిస్తున్నారు.