ఆచార్య ఉగాది స్పెషల్ పోస్టర్, హీరోయిన్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తున్న రామ్‌చరణ్

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ముఖ్యపాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. రాంచరణ్ కి జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది. మే 14 సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం రాంచరణ్ ఆచార్య ఫైనల్ షూటింగులో పాల్గొంటున్నాడు. ఈ షెడ్యూలుతో దాదాపు ఆచార్య షూటింగ్ పూర్తవుతుంది.

తాజాగా ఈ రోజు ఉగాది సందర్భంగా రాంచరణ్, పూజ హెగ్డే రొమాంటిక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆయుధమైనా.. అమ్మాయి అయినా.. సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది అంటూ ఆచార్య నుంచి కొత్త పోస్టర్‌ రిలీజ్ చేశారు. పోస్టర్ లో రామ్‌చరణ్,‌ పూజా హెగ్డే కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తున్నాడు.