మల్లికార్జున థియేటర్ వద్ద నందమూరి ఫ్యాన్స్ హంగామా..

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్ 2న తెల్ల‌వారుజామున 3 గంటలకు హైదరాబాద్ లోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్‌లో బెనిఫిట్ షోస్ పడబోతున్నాయి. ఇక బినిఫిట్ షో చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్స్ కు చేరుకుంటున్నారు. ప్రీమియర్ షో టికెట్ వేలల్లో ఉన్న సరే కొనితీరుతాం..సినిమా చూస్తాం అంటున్నారు. బినిఫిట్ షో కు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్స్ వద్దకు వచ్చి నానా హంగామా చేస్తున్నారు.

భారీ ప్లెక్సీ లు , కటౌట్స్ ఏర్పటు చేస్తూ వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే ఏపీలో బినిఫిట్ షోస్ లేకపోవడం తో అక్కడ నుండి కూడా వందల మంది అభిమానులు ప్రత్యేక బస్సు లో హైదరాబాద్ కు తరలివస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెద్ద సినిమా కావడం..బోయపాటి – బాలకృష్ణ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడం తో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మరికాసేపట్లో తెలియనుంది.