బంగార్రాజు రెండు రోజుల కలెక్షన్స్

కింగ్ నాగార్జున డ్రీమ్ ప్రాజెక్ట్ బంగార్రాజు. త‌న కెరీర్‌లో అతిపెద్ద హిట్‌గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయ‌న మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా నిన్న జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో పాటు సంక్రాంతి పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే సినిమా కావడంతో ప్రేక్షకులు థియేటర్స్ కు బ్రహ్మ రధం పడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది. రెండు రోజుల్లో ఏకంగా 36 కోట్లు వసూలు చేసింది.

నైజాంలో రూ. 4.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.20 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.75 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.39 కోట్లు, గుంటూరులో రూ. 1.79 కోట్లు, కృష్ణాలో రూ. 93 లక్షలు, నెల్లూరులో రూ. 86 లక్షలు సాధించింది.